న్యూఢిల్లీ 7tv : బిహార్లోని పూర్ణియా స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్పై దాడి జరిగింది. ఢిల్లీలోని తన నివాసంలో ఆయన ఇవాళ (ఆదివారం) మీడియా సమావేశం నిర్వహిస్తుండగా.. ఓ దుండగుడు దాడికి యత్నించాడు. దీంతో అక్కడంతా ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిందితుడిని పట్టుకున్న ఎంపీ అనుచరులు పోలీసులకు అప్పగించారు. అతని నుంచి ఓ కత్తి కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పార్లమెంట్ ప్రాంగణంలో రామమందిరం విరాళాల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్ష ఎంపీలు స్కిట్ ప్రదర్శించారు. దాని తర్వాత ఈ దాడి జరగడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

