
బీఆర్ఎస్ నేతలకు సీఎం Revanth Reddy ఘాటు సవాల్ విసిరారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిన చోట బీఆర్ఎస్ ఓట్లు అడగాలని, ఇందిరమ్మ ఇళ్లు కట్టిన ప్రాంతాల్లో తాను ఓట్లు అడుగుతానన్నారు. మీకు డిపాజిట్లు వస్తే తన పేరు మార్చుకుంటానని సీఎం వ్యాఖ్యానించారు.

“రాసిపెట్టుకో కేసీఆర్.. పాలమూరులో మీ జెండా ఇక ఎగరదు” అంటూ మాజీ సీఎం K. Chandrashekar Raoపై రేవంత్ తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన, కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. “నీ పేరు కేసీఆరే అయితే దమ్ముంటే చర్చకు రా.. చర్చలో ఓడితే దేనికైనా సిద్ధం” అని అన్నారు.పాలమూరులో బీఆర్ఎస్ జెండాలు ఎగరనివ్వమని, “గద్దెలు కూలాలి.. జెండాలు దిగాలి” అంటూ సీఎం వ్యాఖ్యానించారు. “తాడూ బొంగరం లేని ఇద్దరు నేతలను మాపైకి వదిలారు.. మీతో చెప్పించుకునే స్థితిలో మేం లేము” అని విమర్శించారు. 2034 వరకు కాంగ్రెస్‌దే అధికారం అని, చేతనైతే కేసీఆర్ అడ్డుకోవాలని సవాల్ చేశారు. “2029లో తేల్చుకుందాం” అంటూ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

