హైదరాబాద్ 7TV FOCUS : క్షుద్రపూజలు అని చెప్పి క్షుద్ర రాజకీయాలుచేస్తున్నది కాంగ్రెస్ పార్టీయే నని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఆరోపించారు. తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్లం. తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వాళ్లం. క్షుద్ర రాజకీయాలు చేయవలసిన అవసరం తమకు లేదని వెల్లడించారు. అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ బాగుండాలని కోరుకుంటాం. కాంగ్రెస్ లాగా పార్టీ క్షుద్ర రాజకీయాలు మాకు తెలియదని పేర్కొన్నారు.హరీష్ రావు గుడికి పోతే తప్పా? ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయవచ్చా? కాంగ్రెస్ పార్టీలాగా మేడిగడ్డకు, చెక్ డ్యామ్‌లోనూ ధ్వంసం చేసి ఓట్లు దండుకోవాలని చూడలేదని ఆరోపించారు. నీళ్లు ఉన్నా కూడా రైతులను ఎండబెట్టే కాంగ్రెస్ సంస్కృతి బీఆర్ఎస్ది కాదని అన్నారు. కరెంటు ఉండి కూడా వ్యవసాయదారుడికి 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదు. ఏ సబ్ స్టేషన్‌కైనా రావడానికి మేము సిద్ధం. 24 గంటల కరెంట్ వస్తే ఇంకా ఎక్కడ ఉందో చెప్పాలి. కనీసం ఐదు, ఆరు సార్లు ప్రతిరోజూ కరెంట్ కోతలు అవుతున్నాయని విమర్శించారు.
హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న వైఖరి విచారకరం
కోర్టులు చెప్పినా హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న వైఖరిని ప్రజాస్వామిక వాదులు గుర్తించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక ఆలోచనా విధానాన్ని గుర్తించాలని, రేవంత్ రెడ్డి హిట్లర్ అని చెప్పుకున్నట్లే రాజ్యాంగ వ్యవస్థలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.

