
7టీవీ ఫోకస్, తొర్రూరు, జూన్ 14: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని గుర్తూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ సాంస్కృతిక విభాగం పాలకుర్తి నియోజకవర్గ కన్వీనర్, ప్రజా గాయకుడు పంజాల బుచ్చి రాములు గౌడ్, అరుణ దంపతుల కుమార్తెలు హిమబిందు, రిహ గౌడ్ల నూతన పుష్పలంకరణ వేడుక ఆదివారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని కళ్యాణ లక్ష్మి ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి హాజరై చిన్నారులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారు హిమబిందు, రిహ గౌడ్లకు శుభాకాంక్షలు తెలియజేసి, వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు. విద్యా, సాంస్కృతిక రంగాల్లో ప్రతిభ కనబరిచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. కుటుంబ సభ్యులను అభినందిస్తూ చిన్నారులు సమాజానికి ఆదర్శప్రాయులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, తొర్రూరు పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్, కౌన్సిలర్ ముద్దసాని సురేష్, ఏఎంసీ డైరెక్టర్ వెంకటాచారి, నాయకులు జీనుగా సురేందర్ రెడ్డి, వెంకన్న యాదవ్, మోత్కూరి రవీంద్రచారి, విస్సంపల్లి బాలకృష్ణ, పంజా కల్పన రాజేష్ యాదవ్, మహేష్ యాదవ్, పంజాల మురళి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

