నల్లగొండ 7tv : తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్( Professor Jayashankars ) సార్ చూపిన మార్గం, సిద్ధాంతాల ( Ideologies ) వల్లనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని నల్లగొండ నాయకులు అన్నారు. సార్ జయంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న జయశంకర్ విగ్రహానికి నల్లగొండ జడ్పీ మాజీ చైర్మన్, మాజీ జిల్లా అధ్యక్షులు బండా నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యమ కాలంలో కేసీఆర్ కు వెన్నుదన్నుగా ఉండి తెలంగాణ రాష్ట్ర సాధనకు తమ సంపూర్ణ సహకారాన్ని అందించారని కొనియాడారు.
Geographic Reference

