7tv focus : ఢిల్లీ షాంగ్రిలా హోటల్లో మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు తన్నుకున్న ఘటనపై టీపీసీసీ విచారణ చేపట్టింది. ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుతో జరిగిన గొడవపై వివరణ ఇవ్వాలని మంత్రి దామోదర రాజనర్సింహను ఆదేశించింది. ఈ మేరకు గురువారం ఉదయం 10 :30 గంటలకు గాంధీభవన్‌కు వచ్చి వివరణ ఇవ్వాలని దామోదరకు సమాచారం కూడా అందించారు. అయితే దామోదర రాజనర్సింహ విచారణకు హాజరుకాలేదు. ఇప్పటివరకు గాంధీభవన్‌కు రాలేదు.

