7tv focus : ఆపద మొక్కులవాడు శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమల లో భక్తుల రద్దీ తగ్గింది . సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వివరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 6 కంపార్టుమెంట్లలలో మాత్రమే భక్తులున్నారు. ఆదివారం స్వామివారిని 77,010 మంది భక్తులు దర్శించుకోగా 22,826 మంది తలనీలాలు సమర్పించుకునానరు. 3.84 లక్షల లడ్డూలను విక్రయించామని వెల్లడించారు.
నవంబరు 5 నుంచి 7వ తేదీ వరకు పవిత్రోత్సవాలు
తిరుపతిలోని శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో నవంబరు 5 నుంచి 7వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను టీటీడీ వైభవంగా నిర్వహించనుంది.

