బ్యాంకాక్ 7TV Desk : థాయ్‌ల్యాండ్ రాజధాని బ్యాంకాక్ శివారు ప్రాంతంలో ఉన్న డెబ్సిరిన్ నాన్తబురి స్కూల్లో ఇవాళ కాల్పుల(Thailand Shooting) ఘటన చోటుచేసుకున్నది. 9వ గ్రేడ్ చదువుతున్న ఓ విద్యార్థి కాల్పులకు తెగించాడు. ఈ ఘటనలో ఆ షూటర్‌తో పాటు మరో టీచర్ మృతిచెందినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్యను ఇప్పుడే నిర్ధారించలేమని జిల్లా పోలీసు అధికారి లెఫ్టినెంట్ కల్నల్ పాసాకార్న్ చైత్వావివాంగ్ తెలిపారు. నాన్తబురి ప్రావిన్సులో ఉన్న బంగ్ కురాయి జిల్లాలో ఈ ఘటన జరిగింది. కాల్పులు జరిపిన షూటర్‌ను విద్యార్థిగా పోలీసులు తేల్చారు. కానీ పూర్తి వివరాలను ఇంకా వెల్లడించలేదు.

