7tv focus : తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 8న దీపావళి ఆస్థానాన్నిటీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించ నుందని అధికారులు వివరించారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుందని తెలిపారు.ఆస్థానంలో భాగంగా శ్రీమలయప్పస్వామి దేవేరులతో కలిసి ఘంటా మండపంలో ఏర్పాటు చేసిన సర్వభూపాల వాహనంలో గరుడాళ్వార్‌కు అభిముఖంగా, సేనాధిపతి శ్రీ విష్వక్సేనల వారు స్వామివారి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షిణ ఆభిముఖంగా వేంచేపు చేస్తారని వెల్లడించారు. ఆ తరువాత స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించడంతో దీపావళి ఆస్థానం పూర్తవుతుందన్నారు.

