7tv focus : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌చే పట్టిన ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన నిరుపేద విద్యార్థి మహేష్‌కు ల్యాప్‌టాప్ అందజేశారు. విద్యార్థి మహేష్ఇంజినీరింగ్ పూర్తి చేసి, కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన డేటా అనలిటిక్స్ కోర్సు కోసం సిద్ధమవుతున్నాడు. మహేష్ చదువుకు ల్యాప్‌టాప్ అవసరమని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు హరీష్ రెడ్డి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కేటీఆర్, గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా తన చేతుల మీదుగా విద్యార్థి మహేష్‌కు ల్యాప్‌టాప్ అందజేశారు.ఈ సందర్భంగా కేటీఆర్ విద్యార్థి మహేష్‌ను అభినందించారు. ఉన్నత విద్యలో మరింత రాణించాలని, ఎంచుకున్న కోర్సులో మంచి ప్రతిభ కనబరిచి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పారు.ఈ కార్యక్రమంలో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వేంకటేశ్వర్ రెడ్డి , బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

