7tv focus : తెలంగాణలో మార్చి 2027లో నిర్వహించనున్న పదో తరగతి, వృత్తి విద్యా కోర్సుల పబ్లిక్ పరీక్షలకు సంబందించి పరీక్ష ఫీజుల చెల్లింపుల్లో ప్రధానోపాధ్యాయులకు సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విద్యార్థుల నుండి ఇప్పటికే పరీక్ష ఫీజులు వసూలు చేసిన ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాలు వాటిని ఆన్లైన్లో ట్రెజరీ ద్వారా జమ చేసేందుకు ప్రయత్నంస్తుండగా సర్వర్ సమస్య కారణంగా ప్రక్రియ ముందుకు సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం చేతిలో ఉన్న విద్యాశాఖలోనే ఇలాంటి సమస్యలు వస్తే వాటిని పరిష్కరించడంలో రోజలు గడుస్తుండంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నెల 1 నుండి ప్రారంభం కావాల్సిన ఫీజుల జమ
పరీక్షల ఫీజుల చెల్లింపునకు విద్యాశాఖ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 1 నుండి 17 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ప్రధానోపాధ్యాయులు సైబర్ ట్రెజరీ ఆన్లైన్ ఇంటిగ్రేషన్ ద్వారా పరీక్ష ఫీజులను ప్రభుత్వ ఖజానాకు జమ చేయాల్సి ఉంది. అయితే ఈ నెల 1 నుండి ఆన్లైన్ చెల్లింపులు చేసేందుకు ప్రయత్నిస్తున్న హెచ్ఎంలకు సర్వర్ అందుబాటులో లేకపోవడం, సాంకేతిక సమస్యలు ఎదురవుతుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

