7tv focus : గురుకుల టెండర్లను టెస్కో ద్వారానే ఇవ్వాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్లజ్జగా, నిస్సిగ్గుగా ఒక దోపిడీ వ్యవస్థను ఎట్ల నడుపుతుందనడానికి సోదాహరణంగా మీకు పత్రికా సమక్షంలో ఇవన్నీ ముందు పెట్టామన్నారు.మన చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రం (కార్పెట్). మరమగ్గాల మీద పాత వస్త్రాలను రీసైకిల్ చేసి తద్వారా యార్ను తయారు చేసిన వస్త్రం. దాదాపు ఇది రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది పేదింటి బిడ్డలకు కార్పెట్లుగా ఇచ్చే పథకం ద్వారా అటు చేనేత కార్మికుల నుంచి ఇటు మఫత్‌లాల్ గుజరాత్‌కు చెందిన కంపెనీ, రకరకాల కంపెనీల దగ్గర నుండి తీసుకున్నారు. వాళ్లేమో సిల్క్ మిక్స్డ్ రీసైకిల్డ్తో తయారు చేసిన కార్పెట్ ఒకటి.. మన తెలంగాణ చేనేత కార్మికులు కష్టించి సాంచల మీద గంటల తరబడి కాళ్లు, చేతులు ఆడిస్తూ వాళ్లకున్న సృజనాత్మకత, మేథా శక్తిని మొత్తం కలగలిపి తయారు చేసిన కార్పెట్ ఇంకోటి.. ఒకటి కప్పుకుంటే వెచ్చగుంటది.. ఇంకోటేమో బొచ్చు అంటుకుంటదని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ వివరించారు.

