7tv focus : ఏపీలోని అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థినిపై(Attack on Student) అత్యంత కిరాతకంగా దాడి చేసిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. దాడి చేసిన హేమంత్ బాలికకు వరుసకు బాబాయ్ అవుతాడని తెలిసింది. హేమంత్ ఆమెను పెళ్లి చేసుకుంటానని మొండిపట్టడంతో కుటుంబ సభ్యులు మందలించారని సమాచారం. అలాగే నిందితుడు గంజాయి, మద్యానికి బానిసగా మారి, గతంలోనూ గర్ల్స్ హాస్టల్లో యువతులపై దాడికి పాల్పడినట్టు స్థానికులు తెలిపారు.కాగా, రాప్తాడులోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన దాడి తీవ్ర కలకలం రేపుతోంది. తరగతి గదిలోకి చొరబడిన హేమంత్ పవర్ చైన్సాతో బాలికపై దాడి చేయడంతో ఆమె ముఖం, తల, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి.

