7tv focus : ఒక బాలిక పోలీస్ సహాయాన్ని కోరింది. క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలో పోలీస్ అధికారి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ అధికారి కింద పని చేసే మహిళా ఉద్యోగిని దీనికి సహకరించింది. బాధిత బాలిక ఫిర్యాదుతో వారిద్దరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఉత్తర గోవాలో ఈ సంఘటన జరిగింది. 16 ఏళ్ల బాలిక సహాయం కోసం తొలుత బాలల సహాయ కేంద్రాన్ని సంప్రదించింది. ఈ నేపథ్యంలో క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఇన్స్పెక్టర్ వికాస్ డేకర్ పరిశీలనకు ఆమె ఫిర్యాదును పంపారు.కాగా, రిబాందర్లోని క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలో జూలై 25, అక్టోబర్ 27 తేదీలలో పోలీస్ ఇన్స్పెక్టర్ వికాస్ డేకర్ ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ పోలీస్ అధికారి సహచరురాలైన మహిళా సిబ్బంది రంజినీ పల్యేకర్ దీనికి సహకరించినట్లు బాధిత బాలిక ఆరోపించింది. వారిద్దరిపై ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేశారు.

