న్యూఢిల్లీ 7tv focus : సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా పేరుతో సర్క్యులేట్ అవుతున్న ఏఐ ఫేక్ వీడియోలను నమ్మి మోసపోవద్దని ఆమె ఆఫీస్ ప్రజలను హెచ్చరించింది. సైబర్ నేరగాళ్లు ప్రియాంక గాంధీ వాయిస్, ముఖంతో ఏఐ వీడియోలు సృష్టిస్తున్నారని పేర్కొంది. ప్రియాంక గాంధీ పేరుతో వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లలో వైరల్ అవుతున్న ఫేక్ ఇన్వెస్ట్మెంట్ వీడియోలను క్లిక్ చేయవద్దని ప్రియాంక గాంధీ ఆఫీస్ విజ్ఞప్తి చేసింది.

