7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూన్ 28: గాజులరామారం సర్కిల్ పరిధిలోని బాలాజీ లేఔట్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పర్యటించి, కాలనీవాసులు ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలపై స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆదివారం గాజులరామారం సర్కిల్ పరిధిలోని బాలాజీ లేఔట్ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలోని అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సమస్యలను పరిశీలించి, స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.

కాలనీవాసులతో మాట్లాడిన ఆయన, వారి సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లి, వీలైనంత త్వరగా పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఓక్షిత కాలనీ అసోసియేషన్ సభ్యులు కాలనీలో నెలకొన్న వివిధ మౌలిక సమస్యలను వివరిస్తూ మాజీ ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు బుచ్చిరెడ్డి, కాలనీవాసులు అంజన్న, శ్రీనివాస్, వెంకట అప్పన్న, వెంకటరెడ్డి, శేఖర్, కృష్ణ, వెంకట్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సురపరాజు, అనిల్, సలీం తదితరులు పాల్గొన్నారు.

