7tv focus : తెలంగాణలో బీజేపీ కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్ల కాలం పూర్తి కావటంతో.. ఇక వచ్చే ఎన్నికల కోసం సమాయత్తం కావాలని పార్టీ నాయకత్వం తేల్చి చెప్పిది. ఇక.. ఎమ్మెల్సీ, ఖైరతాబాద్ ఉప ఎన్ని పైనా కొత్త మార్గదర్శకత్వం చేస్తోంది. అందులో భాగంగా త్వరలో జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్ గా తీసుకుంటోంది. కాగా.. మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు పేరు ఖరారైనట్లు తెలిసింది. దిల్లీలో జరిగిన పార్లమెంటరీ బోర్డు సమావేశం సందర్భంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఒకటి, రెండు రోజుల్లో రాంచందర్రావు అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీ అధినాయకత్వం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ నేతల సమాచారం. ఉత్తర తెలంగాణ నుంచి బీసీ అభ్యర్థికి అవకాశం దక్కనుంది. ముగిసిన టీటీడీ ఛైర్మన్ పదవీ కాలం- పాలనా బాధ్యతలు వారికి కేటాయింపు, ఉత్తర్వులు..!! బీజేపీ నాయకత్వం తుది కసరత్తు కాగా, రెండు నియోజకవర్గాల ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఖరారు కోసం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకునే వారి పేర్లను సేకరించింది. ఒక్కో స్థానం నుంచి నలుగురి పేర్లతో అధిష్ఠానానికి ఆశావహుల లిస్ట్ పంపించారు. అందులో భాగంగా వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానం నుంచి బీసీ అభ్యర్థికే అవకాశం ఇవ్వాలని పార్టీ అధినాయకత్వం నిర్ణయించింది.

