మాస్కో 7tv : ఉక్రెయిన్ భారీ సంఖ్యలో డ్రోన్లతో రష్యాపై అటాక్(Drones Attack) చేసింది. యరోస్లావిల్ సిటీపై జరిగిన దాడిలో ఆయిల్ రిఫైనరీ దెబ్బతిన్నది. ఆ నగరం నుంచి దట్టమైన నల్లటి పొగలు వ్యాపిస్తున్నాయి. తమ నగరంపై అతి పెద్ద అటాక్ జరిగినట్లు గవర్నర్ మైఖస్త్రల్ ఎవ్రేవ్ తెలిపారు. సుమారు 92 డ్రోన్లను ధ్వంసం చేసినట్లు ఆయన చెప్పారు. రష్యాలో ఉన్న అతిపెద్ద 5 ఆయిల్ రిఫైనరీల్లో ఇదొకటి. మరో వైపు రష్యా చేసిన దాడిలో బాలక్లియా సిటీలో ముగ్గురు మృతిచెందినట్లు ఉక్రెయిన్ తెలిపింది. 12 మంది గాయపడ్డారు.

