7tv focus : విద్యార్థులు.. నిరసనలు, ఆందోళనల్లో పాల్గొనకుండా నిషేధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను విజయ్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. పాఠశాల, కళాశాల విద్యార్థులు నిరసనలు, ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనకుండా అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలని విజయ్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ, ఉన్నత విద్యాశాఖ, పోలీసు శాఖ, జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆదేశాలు జారీ చేసిన 24 గంటల్లోనే వాటిని సవరించి ఉపసంహరించుకుంది.

