7tv focus : ఇంటి డోర్ వద్ద ఉన్న వృద్ధురాలిని ఒక వ్యక్తి సమీపించాడు. ఆమెను చిరునామా అడిగాడు. ఆ తర్వాత వృద్ధురాలి మెడలోని గోల్డ్ చైన్ లాక్కుని పారిపోయాడు. అక్కడున్న సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. నవంబర్ 3న రాత్రి 9:23 గంటల సమయంలో కండివాలి వెస్ట్‌లోని ఉమాంగ్ అపార్ట్మెంట్లోకి ఒక వ్యక్తి వచ్చాడు. ఇంటి డోర్ తెరిచే ప్రయత్నంలో ఉన్న వృద్ధురాలిని ఆ బిల్డింగ్‌లోని ఒకరి అడ్రస్ అడిగాడు. టోపీ ధరించిన ఆ వ్యక్తి ఒక కాగితం చూపించగా ఆమె మెట్ల వైపు చూపించింది.కాగా, ఆ వ్యక్తి ఉన్నట్టుండి వృద్ధురాలిపై దాడి చేశాడు. ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కొని అక్కడి నుంచి పారిపోయాడు. ఈ సంఘటనకు ఆ వృద్ధురాలు షాక్ అయ్యింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి గుర్తించేందుకు ఆ అపార్ట్మెంట్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.

