7టివి ఫోకస్, జంగారెడ్డిగూడెం, జూలై 2: జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో విబిజీ రామ్జీ కార్యక్రమాన్ని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు ఉపాధి హామీ కార్మికులతో కలిసి గురువారం ప్రారంభించారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో గురువారం నిర్వహించిన విబిజీ రామ్జీ కార్యక్రమాన్ని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు లాంఛనంగా ప్రారంభించారు. ఉపాధి హామీ కార్మికులతో కలిసి కార్యక్రమంలో పాల్గొని పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామీణాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాగానే శ్రీనివాసరావు, తాళ్లూరి వెంకటేశ్వరరావు, విప్పర లక్ష్మణరావు, సంబంధిత సిబ్బంది, ఉపాధి హామీ కార్మికులు పాల్గొన్నారు.

