
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని సాయిబాబా నగర్ మరియు బాచుపల్లి ప్రాంతాలకు చెందిన అంబుగోల ప్రసాద్ గారు, మేకల రుద్రమదేవి గారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్సకు అవసరమైన ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి గారిని సంప్రదించారు.

వెంటనే స్పందించిన హన్మంతన్న, గౌరవ రాష్ట్ర మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి సహకారంతో బాధితులకు వైద్య చికిత్స మరియు శస్త్రచికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF – LOC) ద్వారా రూ.6,00,000/- (ఆరు లక్షల రూపాయలు) మంజూరు అయ్యేలా చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా మంజూరైన CMRF – LOC పత్రాలను కొలన్ హన్మంత్ రెడ్డి గారు బాధితులకు అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, “సీఎం సహాయనిధి పేద ప్రజలకు గొప్ప వరం. ఆర్థిక ఇబ్బందులతో చికిత్స పొందలేని వారికి ప్రభుత్వం అండగా నిలుస్తూ వారి జీవితాల్లో ఆశను నింపుతోంది” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

