జూలై 31 ( 7 టీవీ ఫోకస్ న్యూస్)
సూరారం పి.యస్ పరిధి కైసర్ నగర్ లో సూరారం పోలీసులు మరియు కూకట్ పల్లి SOT పోలీసుల సంయుక్త దాడి.
పక్కా సమాచారంతో గంజాయి స్మగ్లర్‌ను అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 280 గ్రాముల గంజాయి స్వాధీనం.

కైసర్ నగర్‌కు చెందిన వాచ్మెన్ ఎండీ సలీం అలియాస్ గుడ్డు శర్మ(45) అరెస్ట్.
ప్రాధమిక దర్యాప్తు లో నిందితుడు పాత నేరస్థుడు గా గుర్తింపు,
గతంలో ఇతనిపై 4 ఎన్డీపీఎస్ (గంజాయి) కేసులు నమోదు.
కేసు నమోదు చేసి,రిమాండ్‌కు తరలించిన సూరారం పోలీసులు.

