7tv focus : ఓ ఆటో డ్రైవర్ కుమారుడు స్టైల్‌గా గన్ పట్టుకుని దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యింది. దాంతో స్థానికులు ఆటో డ్రైవర్ దగ్గర మారణాయుధాలు ఉన్నాయనే భయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతడి ఇంట్లో సోదాలకు వెళ్లారు. ఈ సోదాల్లో పోలీసులకు మారణాయుధాలుగా బదులుగా కోట్ల రూపాయల్లో నగదు లభించడంతో షాకయ్యారు. మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్తే.. సాగర్ జిల్లాలోని గోపాల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్ రాజేశ్ అహిర్వార్ తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతని కుమారుడు సౌరభ్ అహిర్వార్ ఇటీవల సోషల్ మీడియాలో ఓ ఫొటోను షేర్ చేశాడు. తుపాకీతో దిగిన ఆ ఫొటో స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. అతని వద్ద మారణాయుధాలు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగింది. దాంతో విషయం పోలీసులకు చేరింది. ఆటో డ్రైవర్ ఇంట్లో ఆయుధాలు ఉన్నాయన్న అనుమానంతో వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి ఇంటికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఎంత వెతికినా ఆయుధాలు లభించలేదు. అయితే పెద్దఎత్తున నగదు సంచులు బయటపడ్డాయి.

