ఏలూరు 7tv focus : జిల్లాలోని బుట్టాయిగూడెం మండలం గవరంపేటలో పెద్దపులి సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా.. గ్రామ పరిసరాల్లో మూడు పశువులపై దాడి చేసి చంపినట్లు అధికారులు తెలిపారు. అంతకుముందు కామవరం సమీపంలో రెండు పశువులను పెద్దపులి చంపడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వరుసగా పశువులపై దాడులు జరుగుతుండటంతో గ్రామస్తులు అప్రమత్తమయ్యారు.

