7tv focus : కిలోల కొద్దీ బంగారాన్ని ధరిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు బిహార్‌కు చెందిన ప్రేమ్‌కుమార్ సింగ్. ఈయనను అందరూ గోల్డ్ మ్యాన్ అని పిలుస్తుంటారు. తాజాగా ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లా కుందాలో రాజకీయ నాయకుడు రాజా భయ్యా నిర్వహించిన శ్రీరామకథ కార్యక్రమానికి బిహార్‌కు చెందిన ‘గోల్డ్ మ్యాన్’ ప్రేమ్ కుమార్ సింగ్ హాజరయ్యారు. ఏకంగా 6.3 కిలోల బంగారు ఆభరణాలు ధరించి అక్కడికి చేరుకున్నారు. వాటి విలువ రూ.10 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం.ప్రేమ్ కుమార్ సింగ్ ఒంటిపై భారీ బంగారు గొలుసులు, చేతులకు కంకణాలు, ఇతర ఆభరణాలు ధరించి రామకథ కార్యక్రమానికి వచ్చారు. ఆయన ప్రత్యేకమైన అలంకరణ అక్కడి వారందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆ కార్యక్రమానికి వచ్చిన భక్తులు, సందర్శకులు గోల్డ్ మ్యాన్‌ను చూసేందుకు ఆసక్తి చూపించారు. చాలామంది ఆయనతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. ప్రేమ్ కుమార్ సింగ్ బిహార్‌లోని భోజ్‌పుర్ జిల్లాకు చెందిన వ్యక్తి. ఆయనకు బంగారు ఆభరణాలంటే ఎంతో ఇష్టం. భారీ మొత్తంలో బంగారం ధరించే అలవాటు కారణంగా ఆయన ‘గోల్డ్ మ్యాన్ ఆఫ్ బిహార్’గా గుర్తింపు పొందారు

