7 టీవీ ఫోకస్: 16-06: మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ గారి ఆదేశాల మేరకు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు ముద్దాపురం శ్రీకాంత్ గౌడ్ గారిని మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) డీసీసీ ఉపాధ్యక్షునిగా నియమించారు.ఈ సందర్భంగా బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు అనంతరం హన్మంతన్న శాల్వాతో సత్కారించి ముద్దాపురం శ్రీకాంత్ గౌడ్ గారికి నియామక పత్రాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా హన్మంతన్న మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న నాయకులకు పార్టీ తగిన గుర్తింపు ఇస్తోందని అన్నారు. ముద్దాపురం శ్రీకాంత్ గౌడ్ గారు డీసీసీ వైస్ ప్రెసిడెంట్గా పార్టీ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి మరింత సమర్థవంతంగా పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ అధిష్ఠానం తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, సంస్థాగత బలోపేతానికి ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు అభిమానులు పాల్గొన్నారు.

