చింతలపూడి 7 టివి ఫోకస్ జూలై 12
చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం లోని గురుకుల పాఠశాలలో మౌలిక వసతుల కొరత ముఖ్యంగా తీవ్రమైన నీటి సమస్య పరిష్కరించాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు స్కూలు ప్రధాన గేటు వద్ద ఆదివారం ధర్నా నిర్వహించారు పాఠశాలలో గత కొన్ని రోజులుగా తాగునీరు అవసరాలకు సరిపడా నీరు రాకపోవడంతో తమ పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూవిద్యార్థుల ఇక్కట్లు అధికారులు పట్టించుకోరా అని ఆవేదన వ్యక్తం చేశారు పాఠశాలలో నీటి సరఫరా నిలిచిపోవడంతో కనీసం స్నానాలు చేయడానికి టాయిలెట్లకు వెళ్లడానికి కూడా నీరు లేక నరకం చూస్తున్నామని విద్యార్థులు వాపోయారు నీరు రాకపోవడం వల్ల కిచెన్‌తో పాటు హాస్టల్ ఆవరణ మొత్తం అపరిశుభ్రంగా మారుతోందని దీనివల్ల అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు అధికారులకు పలుమార్లు విన్నవించినా ఎవరూ స్పందించకపోవడంతోనే తాము రోడ్డుపైకి వచ్చి నిరసన తెలపాల్సి వచ్చిందని వారు పేర్కొన్నారు న్యాయం చేయాలంటూ నినాదాలు చేస్తూతల్లిదండ్రులు విద్యార్థులు పాఠశాల గేటు ముందు బైఠాయించి నిరసన తెలియజేశారు

