7tv focus : తెలంగాణ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, రైతులకు నష్టపరిహారం చెల్లించాలన్నా, సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పదేపదే చెబుతున్నారని మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. అలాంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్కోట్లు ఖర్చు చేయడంపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని పరిస్థితి లేదన్నారు. సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలు కాని సమయంలో ప్రజాధనంతో అంతర్జాతీయ సదస్సు నిర్వహించడం వల్ల రాష్ట్ర ప్రజలకు కలిగిన ప్రయోజనాలేమిటని ప్రశ్నించారు. ఈ సదస్సు ద్వారా ఎన్ని దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు? ఎన్ని పెట్టుబడులు వచ్చాయి? ఎన్ని పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి? ఎంతమందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి? అనే వివరాలను ప్రభుత్వం సమగ్ర నివేదిక రూపంలో ప్రజల ముందు ఉంచాలని కోరారు.

