7tv desk : అమెరికాతో దాదాపు ఆరు నెలలుగా కొనసాగుతున్న యుద్ధం ఇరాన్లో తీవ్ర ఆర్థిక సంక్షోభం సృష్టించింది. అక్కడి ప్రజలు ఎన్నో కష్టాలు పడుతూ రోజులను నెట్టుకొస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరగడం, ఆదాయాలు తగ్గడంతో అక్కడి ప్రజలు బతుకుదెరువు కోసం తమ వద్ద ఉన్న వస్తువులను అమ్ముకోవడం లేదా అద్దెకివ్వడం ప్రారంభించారు.
జుట్టు, దుస్తులు, చెప్పులు, పర్ఫ్యూమ్ బాటిళ్లను విక్రయించడంతో పాటు ల్యాప్‌టాప్‌లను అద్దెకిస్తూ అదనపు ఆదాయం సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు. ఇరాన్‌కు చెందిన వార్తా సంస్థ ఐఎల్ఎన్ఏ (ILNA) ఈ పరిస్థితిని ‘సర్వైవల్ ఎకానమీ’గా అభివర్ణించింది. ఇరాన్‌లోని ఆన్లైన్ క్లాసిఫైడ్ వెబ్సైట్లలో వాడిన వస్తువుల విక్రయ ప్రకటనలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా మహిళలు తమ సహజ జుట్టును హెయిర్ ఎక్స్టెన్షన్ల కోసం విక్రయిస్తున్నారు. అలాగే ఇంట్లో ఉపయోగంలో లేని చిన్నచిన్న వస్తువులను కూడా అమ్మకానికి పెడుతున్నారు.

