మరికల్ ఎస్సై విక్రమ్,,
7,,టీవీ న్యూస్ ఫోకస్,,, 23/7/2026/ నారాయణపేట జిల్లా
మరికల్): జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు నారాయణపేట జిల్లా మరికల్ పోలీస్ స్టేషన్లో గురువారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమంలో భాగంగా మరికల్ ఎస్సై విక్రమ్ బ్లూ కోట్స్ పోలీసు సిబ్బందికి హెల్మెట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎస్సై విక్రమ్ మాట్లాడుతూ… ద్విచక్ర వాహనదారులు తమ ప్రాణ రక్షణ కోసం తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్‌ను ధరించాలని సూచించారు. హెల్మెట్ ధరించడం చట్టపరమైన బాధ్యత మాత్రమే కాకుండా, ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడే రక్షణ కవచమని తెలిపారు.పోలీసు సిబ్బంది ముందుగా ట్రాఫిక్ నిబంధనలను పాటించి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని, విధుల నిర్వహణలోనూ వ్యక్తిగతప్రయాణాల్లోనూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ ధరించడం వల్ల తలకు తీవ్ర గాయాలు అయ్యే ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని పేర్కొన్నారు.అధిక వేగంతో వాహనాలు నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం, ట్రిపుల్ రైడింగ్ చేయడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు.
“మీ కుటుంబం మీ కోసం ఎదురుచూస్తోంది… హెల్మెట్ ధరించండి – సురక్షితంగా ఇంటికి చేరండి” అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని ఎస్సై విక్రమ్ కోరారు.ఈ కార్యక్రమంలో బ్లూ కోట్స్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

