విజయవాడ 7tv focus : పుష్కర ఎత్తిపోతల పథకం పైప్లైన్ పనులపై మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు(బుధవారం) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇటీవలే పుష్కర ఎత్తిపోతల పైప్లైన్ పనులకు సంబంధించి వర్క్ షెడ్యూల్ను సీఎం చంద్రబాబుకు అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులు అందజేశారు. ఈ క్రమంలో షెడ్యూల్ ప్రకారం పనుల జరుగుతున్నాయో లేదో పరిశీలించి, మంత్రి నిమ్మలకు ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు రిపోర్ట్ అందించారు. అయితే, పనులు వేగంగా జరగకపోవడంపై అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులపై నిమ్మల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

