చింతలపూడి, జూలై 6 (7 టీవీ ఫోకస్): సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన భారత మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్‌రామ్ సేవలు చిరస్మరణీయమని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్ అన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. భారత మాజీ ఉప ప్రధానమంత్రి, సామాజిక న్యాయ పోరాట యోధుడు బాబు జగ్జీవన్‌రామ్ వర్ధంతి సందర్భంగా చింతలపూడిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాబు జగ్జీవన్‌రామ్ దేశ అభివృద్ధికి, ముఖ్యంగా అణగారిన వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వం కోసం చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. ఆయన ఆశయాలను భావితరాలు ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని బాబు జగ్జీవన్‌రామ్‌కు నివాళులర్పించారు.

