7tv focus : పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఇవాళ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో చేరిక కార్యక్రమం జరిగింది. హర్మీత్ సింగ్ పాతానమజ్రా, చేతన్ సింగ్ జౌరామజ్రా, కున్వార్ విజయ్ ప్రతాప్‌లు.. పంజాబ్ బీజేపీ ఇంచార్జీ సతీశ్ పూనియా సమక్షంలో బీజేపీలో చేరారు. కో-ఇంచార్జీ విరేంద్ర సచ్దేవ్, రాష్ట్ర బీజేపీ చీఫ్ కేవాల్ సింగ్ థిల్లాన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ జిందాబాద్ అని ఆ ముగ్గురు నినాదాలు చేశారు. పంజాబ్ తన అస్థిత్వం కోసం పోరాడుతోందని, పంజాబ్ సింధు గుజరాత మరాఠ అని పంజాబ్‌కు ఎంతో గౌరవం ఇచ్చారని, కానీ ఇప్పుడు రాష్ట్రం దయనీయంగా మారిందని, గత అయిదేళ్ల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీతో తాను ఇంటెర్న్‌షిప్‌లో ఉన్నట్లు కున్వర్ విజయ్ ప్రతాప్ తెలిపారు. పంజాబ్‌ను ఉడ్తా పంజాబ్ అని పిలుస్తున్నారని, ఆమ్ ఆద్మీ పార్టీ 2.5 లక్షల కోట్ల రుణాలు తీసుకున్నదని, రాష్ట్రాన్ని నాశనం చేశారని హర్మీత్ సింగ్ ఆరోపించారు. ప్రధాని మోదీ తన వాగ్ధానాలను నెరవేర్చారని, అందుకే తాను ఆప్‌ను వీడి బీజేపీలో చేరినట్లు చేతన్ సింగ్ పేర్కొన్నారు.

