7tv focus : అమెరికాలో ఈసారి మిడ్‌టర్మ్ ఎన్నికలు కొత్త అధ్యాయానికి తెరతీశాయి. దేశ చరిత్రలో తొలిసారిగా ఓ ముస్లిం సెనెట్‌కు ఎన్నికయ్యారు. మిచిగన్ రాష్ట్రం నుంచి బరిలో నిలిచిన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి అబ్దుల్ ఎల్ సయీద్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మైక్ రాజర్స్పై ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో అబ్దుల్‌కు 22 లక్షల ఓట్లు పోలవగా ప్రత్యర్థి రాజర్స్కు 20 లక్షల ఓట్లు వచ్చాయి. ఈ విజయంపై ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అమెరికా ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కడం గర్వకారణంగా భావిస్తున్నానని అన్నారు. అసలు పని ఇకపై మొదలవుతుందని కూడా చెప్పారు.

