7టీవీ ఫోకస్, కూకట్ పల్లి, జూన్ 27: ఇండియన్ టాలెంట్ ఒలింపియాడ్ (ఐటీఓ) రాష్ట్రస్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన కొండాపూర్‌కు చెందిన విద్యార్థిని జెస్సికాను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తన క్యాంపు కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. ఇండియన్ టాలెంట్ ఒలింపియాడ్ (ఐటీఓ) రాష్ట్రస్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించి ప్రతిభ చాటిన కొండాపూర్‌కు చెందిన విద్యార్థిని జెస్సికాను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తన క్యాంపు కార్యాలయంలో అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, విద్యార్థులు చదువులతో పాటు క్రీడలు, ఇతర ప్రతిభా రంగాల్లోనూ రాణించాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పుట్టిన ఊరికి మంచి పేరు తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగాలని అన్నారు. జీవితంలో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే క్రమశిక్షణతో ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నగేష్, కొండాపూర్ బీఆర్ఎస్ ఇన్చార్జి సంతోష్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

