7tv focus : రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించనన్నట్లు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తెలిపారు. తారన్తరన్ జిల్లాలో రెండు బస్సులు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు యాత్రికులు, మోటార్ సైకిల్ వెనుక కూర్చున్న మరో వ్యక్తి మరణించారు. వారికి ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారాన్ని ప్రకటించారు.అదేవిధంగా ప్రమాదంలో గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. శనివారం నౌషెహ్రా పన్నూన్ సమీపంలో జాతీయ రహదారి-54 పై పంజాబ్ ప్రభుత్వానికి చెందిన రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో నలుగురు యాత్రికులు, మోటార్‌సైకిల్‌పై వెనుక కూర్చున్న మరో వ్యక్తి మరణించారు. మరో 15 మందికిపైగా గాయపడ్డారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడానికి ఆదివారం అమృత్‌సర్‌లోని ఆస్పత్రిని సందర్శించిన మాన్ విలేకరులతో మాట్లాడుతూ ఈ ఘటనను దురదృష్టకరమైనదిగా అభివర్ణించారు.

