
7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 14: ప్రగతి నగర్‌లోని సర్వే నంబర్లు 178, 179లో ప్రగతి సెంట్రల్ స్కూల్ పక్కనే మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న స్వామి వివేకానంద పార్క్‌ను తక్షణమే అభివృద్ధి చేసి ప్రజా వినియోగంలోకి తీసుకురావాలని ఆకుల సతీష్ డిమాండ్ చేశారు. పార్కులో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించి, 90 శాతం పూర్తయిన స్విమ్మింగ్ పూల్ పనులను పూర్తి చేయాలని కోరారు.
అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పార్కులోని వాకింగ్ ట్రాక్‌ను శ్రమదానంతో శుభ్రం చేశారు. పార్కులో సహజసిద్ధమైన కొండలు, పెద్ద వృక్షాలు ఉండటంతో ఇది ప్రగతి నగర్ ప్రజలకు విలువైన పర్యావరణ సంపద అని పేర్కొన్నారు. పార్కు అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి, స్విమ్మింగ్ పూల్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ, లేనిపక్షంలో ప్రజలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అరుణ్ రావు, చందు, పి.వి. శ్రీనివాస్, ఎల్ల స్వామి, మురళీకృష్ణ, కృష్ణ, కిషోర్, వెంకట్రావు, రాజిరెడ్డి, రమణ, రాము తదితరులు పాల్గొన్నారు.

