7tvfocus : టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీగురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 15 ఏళ్ల వయసులోనే తన విధ్వంసకర బ్యాటింగ్‌తో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. అంతేకాక అతి పిన్న వయసులో అంతర్జాతీయ టీ20 క్రికెట్లోకి అరంగేట్రం చేసి.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ క్రమంలోనే తాజాగా వైభవ్ కెరీర్‌పై బీసీసీఐ దృష్టి పెట్టింది. సచిన్ లాంటి అద్భుతమైన కెరీర్ వైభవ్ నిర్మించుకోవాలని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా సూచించారు.గురువారం బీసీసీఐ రివ్యూ మీటింగ్ జరిగింది. అనంతరం దేవజిత్ సైకియా విలేకర్లతో మాట్లాడుతూ.. పలు విషయాలను వెల్లడించారు. రోహిత్ శర్మ ఫామ్ గురించి సందేహం అవసరం లేదని స్పష్టం చేశాడు. ఈ సందర్భంగా వైభవ్ సూర్యవంశీ ప్రస్తావననూ తీసుకొచ్చారు. ఓ 15 ఏళ్ల కుర్రాడిని అంతర్జాతీయ క్రికెట్లోకి తీసుకొచ్చినందుకు బీసీసీఐ గర్వపడుతోందని తెలిపారు. తన సత్తా ఏంటో ఇప్పటికే అభిమానులకు వైభవ్ చూపించాడని, మున్ముందూ ఇలానే సరైన దిశలో సాగాలని కోరుకుంటున్నామని సైకియా పేర్కొన్నారు

