7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూన్ 20: ప్రముఖ సామాజిక సేవకుడు, ప్రజల అభిమానాన్ని చూరగొన్న సయ్యద్ అబూబకర్ హుస్సేన్ జన్మదినాన్ని ఆయన స్నేహితులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుల్లా విజయ్ కుమార్, శ్రవణ్ కుమార్, డా. అష్ఫాక్ సాహెబ్, సయ్యద్ ఉస్మాన్ హుస్సేన్, వాసంరావు సత్యం, మహమ్మద్ బిలాల్ తదితరులు సయ్యద్ అబూబకర్ హుస్సేన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సయ్యద్ అబూబకర్ హుస్సేన్ సమాజ సేవలో ముందుండి పనిచేస్తూ అందరి అభిమానాన్ని సంపాదించుకున్నారని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను నిర్వహించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.


