7tv focus : భారతదేశమంటే విభిన్న రకాల సంసృతి, సంప్రదాయాలకు కేరాఫ్ అడ్రస్ అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పండుగలు చేసుకోవడంలోనైనా, సంస్కృతి, సంప్రదాయాలను పాటించడంలోనైనా ఒక్కో రాష్ట్రానిది ఒక్కో ప్రత్యేకత. ఒక్కో రాష్ట్రంలో ప్రజలు వారి నేపథ్యం, జీవనశైలికి అనుగుణంగా పండుగలు జరుపుకుంటుంటారు. ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో నాగాలాండ్ కూడా ఉంటుందని తెలిసిందే.తాజాగా నాగాలాండ్ వాసులు ప్రత్యేక పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నాగాలాండ్‌లోని గారో తెగ పంట కోతల అనంతరం జరుపుకునే 1000 Drums Wangala Festival 2026 ను జరుపుకుంటున్నారు. నాగాలాండ్ సీఎం కొన్రాడ్ కే సంగ్మా గారో తెగవాసులతో కలిసి సంప్రదాయ డప్పులు వాయించి ఫెస్టివల్‌ను ప్రారంభించారు.

