వి బి జి రాంజీ పథకాన్ని రద్దుచేసి 2005 ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అల్వాల వీరయ్య

వార్త ప్రతిక :-మరిపెడ
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలు కల్పించి వి బి జి రాంజీ పథకాన్ని రద్దుచేసి 2005 ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహబూబాద్ జిల్లా కార్యదర్శి అల్వాల వీరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మే 30న శనివారం మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించారు అనంతరం జరిగిన సమావేశంలో వీరయ్య మాట్లాడుతూ పని ప్రదేశాలలో మంచినీటి సౌకర్యం టెంటు ప్రాథమిక కిట్టు పనిముట్లు తదితర కనీస సౌకర్యాలు కల్పించాలని వీరయ్య డిమాండ్ చేశారు. పనిచేసిన కూలీలకు ప్లేసిప్పులు ఇచ్చి వారం వారం కూలీలకు వేతనాలు చెల్లించాలని అన్నారు కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యవసర ధరలు విపరీతంగా పెంచడం వల్ల కూలీలు కొని తినలేని పరిస్థితిలో ఉన్నారని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉపాధి పనిలో రోజు కూలి రూ 600 ఇవ్వాలని డిమాండ్ చేశారు బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన విబిజి రాంజీ పథకాన్ని రద్దుచేసి 2005 ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో కూలీలందరినీ ఏకం చేసి ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సంఘం గ్రామ అధ్యక్షులు తాడూరి వీరేంకులు అల్వాల పురుషోత్తం చేనే పోయిన లాలయ్య ఉపాధి మెట్లు కూలీలు తదితరులు పాల్గొన్నారు

