
నాగర్ కర్నూల్ జిల్లాలో బహుజన సమాజ్ పార్టీ(బిఎస్పీ) ఆధ్వర్యంలో స్థానిక బాబాసాహెబ్ డా. అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర రాష్ట్ర ఏర్పాటు దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పించి, జిల్లా అధ్యక్షులు బోనాసి రాంచందర్ అడ్వకేట్ గారు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా జోన్ ఇంచార్జ్ లు బీసమోళ్ల యోసేఫ్, పృథ్వీరాజ్, పార్లమెంట్ ఇంచార్జ్ లు మిద్దె మహేష్, సి.కళ్యాణ్ లు మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దేశంలో నూతన రాష్ట్రాల ఏర్పాటుకు అనుగుణంగా రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ను పొందుపర్చడం జరిగిందన్నారు. ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ స్వరాష్ట్రము సిద్దించిందన్నారు. సకల జనుల పోరాటం, అమరుల బలిదానాలతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతుంటే దేశంలోనే మొట్టమొదటగా ఒక జాతీయ పార్టీగా బిఎస్పీ పార్టీ తెలంగాణకు అండగా ఉందన్నారు. ఆనాడు ఉభయసభల్లో ఉన్న 39 MPలతో తెలంగాణకు ఏకగ్రీవ పూర్తి మద్దత్తు పార్లమెంట్ లో బేహేన్ కుమారి మాయావతి గారు ఇచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ స్వరాష్ట్రము సిద్ధించాక కూడా ప్రత్యేక బడ్జెట్ ఇవ్వాలని పార్లమెంట్ లో బేహేన్ జీ మాట్లాడిన విషయాన్ని పేర్కొన్నారు. తెలంగాణ కంటే ముందు ఉత్తరఖండ్ రాష్ట్ర ఏర్పాటులో కూడా బిఎస్పీ పార్టీ కీలక పాత్ర పోశించిందనీ అన్నారు. స్వయంగా మాయావతి గారే, తన ముఖ్యమంత్రి కాలంలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాన్ని 4 చిన్న రాష్ట్రాలుగా ఏర్పాటు చేయాలనీ అసెంబ్లీలో తీర్మానం చేసిందన్నారు. తదనంతరం అమరుల ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రలో, ప్రత్యేక తెలంగాణలో ఆధిపత్య కులాల రాజ్యమే నడుస్తుందని విమర్శించారు. అమరుల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో నూటికి 90శాతంగా ఉన్న బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యంగా పోరాడుదామని పిలుపునిచ్చారు. ఇ కార్యక్రమంలో జిల్లా ఈసీ మెంబర్స్ బంకల దాస్, ఆంజనేయులు, కొల్లాపూర్ అసెంబ్లీ ఇంచార్జ్ పుట్టపాగ విష్ణు, నాయకులు జన్ను ఆంజనేయులు, శాయినపేట రాములు, కాకునూర్ మధు, దేవరపాగ రాముడు, బిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సాయిబాబా, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

