అనాథాశ్రమం, మదర్సాలో పండ్లు, బియ్యం పంపిణీ

7టీవీ ఫోకస్, తొర్రూరు, జూన్ 14: తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్ జన్మదిన వేడుకలను ఆదివారం డివిజన్ కేంద్రంలో ఆయన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. జన్మదినం సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించగా, సోషల్ మీడియా వేదికగా కూడా శుభాకాంక్షల సందేశాలు వెల్లువెత్తాయి. అలాగే మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్దముప్పారం అనాథ శరణాలయం, తొర్రూరులోని మదర్సాలో చిన్నారులకు పండ్లు, బియ్యం పంపిణీ చేశారు. సేవా కార్యక్రమాల ద్వారా జన్మదినాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు. మా ఫౌండేషన్ డైరెక్టర్ పస్తం కృష్ణ మాట్లాడుతూ, మున్సిపల్ చైర్మన్ శ్రావణ్ కుమార్ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా గుర్తింపు పొందారని అన్నారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని అనాథ చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు నింపాలనే ఉద్దేశంతో సేవా కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు.మున్సిపల్ చైర్మన్ శ్రావణ్ కుమార్ జన్మదినం సందర్భంగా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా జీవితంలో మరింత ఉన్నత స్థానాలను అధిరోహించి ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షించారు.


super