
భారతదేశమే తన కుటుంబంగా భావిస్తూ, దేశ అభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తున్న నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు. మంచితనం తన కులంగా, త్యాగం తన మతంగా భావిస్తూ, అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణమే లక్ష్యంగా నిరంతరం ప్రజల కోసం కృషి చేస్తున్న భావి భారత ప్రధాని, యువనేత శ్రీ రాహుల్ గాంధీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గ్రంథాలయ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు ముత్యం రెడ్డి, బుయ్యని శివ కుమార్, డీసీసీ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీ రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ ప్రజల సంక్షేమం, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం ఆయన చేస్తున్న కృషిని కొనియాడుతూ, ఆయనకు దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యం కలగాలని ఆకాంక్షించారు.

