7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూన్ 26: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం డివిజన్లో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రజలకు ఓటరు నమోదు, వివరాల సవరణపై అవగాహన కల్పించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని 129 సూరారం డివిజన్లో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) వెరిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక మాజీ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్ బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్వోలు), బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు)తో కలిసి పలు బస్తీల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఓటర్లకు ఓటరు జాబితాలో కొత్తగా పేరు నమోదు, చిరునామా మార్పు, పేరు, వయస్సు తదితర వివరాల సవరణ, కొత్త ఓటరుగా నమోదు చేసుకునే విధానం, అవసరమైన పత్రాలు, వెరిఫికేషన్ ప్రక్రియపై సమగ్రంగా వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవడంతో పాటు, వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే వాటిని సవరించుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రక్రియలో ప్రజలు చురుకుగా పాల్గొని సహకరించాలని కోరారు.

