శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ ఈటల రాజేందర్
7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూన్ 27: మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ OBC మోర్చా అధ్యక్షుడిగా ఎన్నికైన జేకే శేఖర్ యాదవ్‌ను ఎంపీ ఈటల రాజేందర్ అభినందించారు. ఈ సందర్భంగా శేఖర్ యాదవ్ మర్యాదపూర్వకంగా ఎంపీని కలిసి శాలువాతో సత్కరించగా, ఎంపీ కూడా ఆయనకు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ ఓబిసి మోర్చా అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన జేకే శేఖర్ యాదవ్, ఎంపీ ఈటల రాజేందర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శేఖర్ యాదవ్ ఎంపీకి శాలువా కప్పి సత్కరించారు. అనంతరం ఎంపీ ఈటల రాజేందర్ శేఖర్ యాదవ్‌కు శాలువా కప్పి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, మేడ్చల్ జిల్లాలో బీజేపీని మరింత బలోపేతం చేయడానికి అంకితభావంతో పనిచేయాలని, పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం పెంపొందించి ఐక్యతకు కృషి చేయాలని శేఖర్ యాదవ్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గిరి వర్ధన్ రెడ్డి, రావుల శేషగిరిరావు, మేకల సురేష్ రెడ్డి, కట్ట కుమార్, సిద్ధిరామిరెడ్డి, యాదగిరి యాదవ్, సుబ్బారావు, సౌరబ్ భాయ్, చక్రి, మల్లేష్, ఆర్తిక్ యాదవ్, రాజిరెడ్డి, సతీష్ సాగర్, గండి రాజు యాదవ్, కుమార్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

