7టీవీ ఫోకస్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, జూన్ 27: భువనగిరిలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘రాజ్యాధికార సమరభేరి’ బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ కొమ్ముల ప్రవీణ్ రాజ్ పిలుపునిచ్చారు. సభ పోస్టర్ను కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం ఆవిష్కరించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) ఆధ్వర్యంలో భువనగిరిలో నిర్వహించనున్న ‘రాజ్యాధికార సమరభేరి’ బహిరంగ సభ పోస్టర్ను కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం పార్టీ జిల్లా అధ్యక్షుడు గాడిపల్లి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ కొమ్ముల ప్రవీణ్ రాజ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొమ్ముల ప్రవీణ్ రాజ్ మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఎన్నో దశాబ్దాలుగా కేవలం ఓటు బ్యాంకులుగానే మిగిలిపోయాయని అన్నారు. వారి సామాజిక, రాజకీయ, ఆర్థిక సాధికారతకు రాజ్యాధికారం అవసరమని పేర్కొన్నారు. ‘రాజ్యాధికార సమరభేరి’ సభ బహుజన వర్గాల ఆత్మగౌరవాన్ని చాటిచెప్పే చారిత్రాత్మక సభగా నిలుస్తుందని, రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధించాలంటే బహుజనులంతా ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. భువనగిరిలో జరిగే సభకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బిక్షపతి, పార్టీ నాయకులు రమేష్, హనుమంతు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

