7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూన్ 27: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారం సర్కిల్ పరిధిలో జరుగుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని మేడ్చల్ డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. ఓటరు జాబితా ప్రక్షాళనలో ప్రజలు చురుకుగా పాల్గొని సరైన వివరాలను నమోదు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం సర్కిల్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్లో నిర్వహిస్తున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని మేడ్చల్ డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్ స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన ఎస్ఐఆర్ కార్యక్రమంలో ప్రతి ఓటరు భాగస్వామి కావాలని కోరారు. బీఎల్వోలు అందజేసే ఎన్యూమరేషన్ ఫారంలో పూర్తి, సరైన వివరాలను నమోదు చేసి ఓటు హక్కును పరిరక్షించుకోవాలని సూచించారు. రెండు ప్రాంతాల్లో ఓటు నమోదు చేసుకున్న వారి పేర్లను నిబంధనల ప్రకారం తొలగించాలని, నకిలీ ఓట్లను పూర్తిగా గుర్తించి తొలగించేలా బీఎల్వోలు చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువతీ, యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ప్రతి ఒక్కరూ ఎస్ఐఆర్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కూన శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఈ కార్యక్రమంలో జాకీర్, బలరాం, సీహెచ్ బుచ్చిరెడ్డి, పద్మ, సలీం, రజాక్, దుర్గేష్, కల్పన, నరసింహ, ఆబేద్, లక్ష్మి, సుజాత, లావణ్య, బీఎల్వోలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

