7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూన్ 27: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం డివిజన్లో నిర్వహిస్తున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కొలన్ హన్మంత్ రెడ్డి పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని బీఎల్వోలకు సూచించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 293వ డివిజన్ పరిధిలోని సూరారంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కొలన్ హన్మంత్ రెడ్డి బీఎల్వోలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటరు నమోదు ప్రక్రియను బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవడంతో పాటు ఓటరు జాబితాలో ఖచ్చితత్వం ఉండేలా అవసరమైన వివరాలను సేకరించాలని అన్నారు. ప్రజలు బీఎల్వోలు అందజేసే ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తిగా నింపి సమర్పించాలని, 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువత ఈ అవకాశాన్ని వినియోగించుకుని కొత్త ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి ఒక్కరూ ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగస్వాములై ఓటరు జాబితా సవరణ ప్రక్రియను విజయవంతం చేయాలని కొలన్ హన్మంత్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో సంతోష్, సురేందర్ రెడ్డి, రాంచందర్ రెడ్డి, శివకుమార్, కృష్ణారెడ్డి, మౌనిక, మీనాక్షి, అబ్బు, సజ్జు ఖాన్, లక్ష్మణ్, ప్రభాకర్ రెడ్డి, నదీమ్, బూత్ లెవల్ ఆఫీసర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

